ఈ లక్షణాలు ఉంటే 100 శాతం కాల్షియం లోపమే..

Dharmaraju Dhurishetty
Aug 28,2024
';

కాల్షియం లోపం వల్ల చాలా మంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

';

కాల్షియం లోపం రావడానికి ప్రధానం కారణంగా ఎక్కవగా అనారోగ్యకరమైన ఆహారాలు తినడం.

';

చాలా మందిలో ఈ లోపం విటమిన్ డి లోపం కారణంగా కూడా వస్తోంది.

';

అలాగే ఈ లోపం మూత్రపిండ వ్యాధి, థైరాయిడ్ సమస్యల కారణంగా కూడా వస్తోంది.

';

కాల్షియం లోపం ఉన్నప్పటీ దాని కారణంగా వచ్చే లక్షణాలు గుర్తపట్టలేకపోతున్నారు.

';

కాల్షియం లోపం ప్రధాన లక్షణాలు ఇప్పుడు తెలుసుకోండి.

';

ఎముకలు బలహీనపడటం: కాల్షియం ఎముకలకు ప్రధాన ఖనిజం. కాల్షియం లోపం వల్ల ఎముకలు పలుచగా, బలహీనంగా మారి, అస్థిపంజర వ్యాధి (Osteoporosis) వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

';

దంతాలు సమస్యలు: దంతాలు కూడా కాల్షియం మీదే ఆధారపడి ఉంటాయి. కాల్షియం లోపం వల్ల దంతాలు బలహీనంగా మారుతాయి.

';

కండరాల నొప్పులు, తిమ్మిర్లు: కాల్షియం కండరాల పనితీరుకు కూడా ముఖ్యం. ఈ లోపం వల్ల కండరాలు బలహీనపడి, నొప్పి, తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది.

';

చర్మ సమస్యలు: కాల్షియం లోపం వల్ల చర్మం పొడిగా, చికాకుగా మారుతుంది.

';

జుట్టు సమస్యలు: జుట్టు పెరుగుదలకు కాల్షియం అవసరం. ఈ లోపం వల్ల జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి.

';

అలసట: కాల్షియం లోపం వల్ల శరీరం అలసిపోయి, నిద్రలేమి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

మూర్ఛ: తీవ్రమైన కాల్షియం లోపం వల్ల మూర్ఛలు వచ్చే ప్రమాదం ఉంది.

';

గుండె సమస్యలు: కాల్షియం లోపం కారణంగా గుండె స్పందనలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story