మహేశ్ బాబు సమతుల్య ఆహారం తీసుకుంటారు. కొవ్వులు, కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న ఆహారం ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తాడట.
ఉదయం బ్రేక్ ఫాస్టులో ఉడకబెట్టిన గుడ్లు, గింజలు, పండ్లు ఓట్స్ ఎక్కువగా తీసుకుంటారట.
మధ్యాహ్న భోజనంలో క్వినోవా లేదంటే మాంసం తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తాడట.
రాత్రి భోజనంలో పిండిపదార్థాలు లేదా ప్రొటీన్లు ఉన్న ఫుడ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడట. చికెన్, గోధుమ రొట్టెలు, గుడ్లు తింటారు.
మహేశ్ బాబు ఫిట్‌నెస్ కు కారణం వ్యాయామం. ప్రతిరోజూ గంటన్నరపాటు వ్యాయామం చేస్తాడట.
తక్కువ మొత్తంలో ఎక్కువగా తినేందుకు ఇష్టపడతాడట. ప్రతిరోజూ ఐదు నుంచి ఆరు సార్లు తింటాడట.