ప్రస్తుతం చాలామంది అన్నం తినే క్రమంలో ఒక్క ముద్దైనా పచ్చడితో తినేందుకు ఇష్టపడుతున్నారు.
';
చాలామంది వివిధ రకాల పచ్చళ్లను కొనుక్కొని మరి.. రోజు తింటూ ఉంటున్నారు. నిజానికి ఇలా కొనుగోలు చేసిన పచ్చళ్ళు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి..
';
కొంత కష్టపడితే చాలు అద్భుతమైన టేస్ట్ తో ఇంట్లోనే సులభంగా పచ్చళ్లను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల పచ్చళ్లను ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.
';
సులభంగా తయారు చేసుకునే పచ్చళ్ళలో చింతపండు నిలువ పచ్చడి ఒకటి. ఈ పచ్చడి అద్భుతమైన టేస్ట్ ని కలిగి ఉంటుంది.
';
చింతపండు నిల్వ పచ్చడిని ఎంతో సులభంగా తక్కువ ఇంగ్రిడియంట్స్ తో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి.
';
కావలసిన పదార్థాలు: చింతపండు - 250 గ్రాములు, నూనె - 100 మి.లీ, ఆవాలు - 1 టేబుల్ స్పూన్, మెంతులు - 1/2 టేబుల్ స్పూన్, కారం - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - 1/2 టీ స్పూన్, ఇంగువ - చిటికెడు
';
తయారీ విధానం: ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా గింజలు తీసిన చింతపండును శుభ్రం చేసి నీటిలో బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది.
';
ఇలా నానబెట్టుకున్న చింతపండు నుంచి చిక్కని గుజ్జును బయటికి తీసి ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకోండి.
';
ఆ తర్వాత ఒక పాన్ లో అన్ని రకాల పోపు దినుసులు వేసుకొని బాగా వేపుకోవాల్సి ఉంటుంది. అందులోనే కరివేపాకు, తగినంత ఇంగువ, పసుపు వేసుకొని బాగా వేపుకోండి.
';
అన్ని బాగా వేగిన తర్వాత అందులోనే చింతపండు గుజ్జును వేసుకొని ఓ 15 నిమిషాల పాటు బాగా వేపుకోవాల్సి ఉంటుంది.
';
బాగా వేపుకున్న తర్వాత మీరు పచ్చడి నుంచి నూనె పైకి రావడం గమనిస్తారు. ఇలా వచ్చిన తర్వాత అందులో తగినంత కారం, ఉప్పు వేసుకొని మరి కాస్త సేపు బాగా ఉడికించుకోండి.
';
ఇలా ఉడికించుకున్న పచ్చడిని చల్లారిన తర్వాత గాజు సీసాలోకి భద్రపరచుకోండి. అంతే కావలసినప్పుడల్లా అన్నంలో వేసుకుని తినండి.