శరీర బరువు, కొలెస్ట్రాల్‌ తగ్గించే కొర్రల పిండి రోటీల తయారీ విధానం.

Dharmaraju Dhurishetty
Jun 01,2024
';

ప్రతి రోజు కొర్రలతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా శరీర బరువును నియంత్రించుకోవచ్చు.

';

అంతేకాకుండా ఈ కొర్రల్లో ఉండే గుణాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

అలాగే కొర్రలతో తయారు చేసిన రోటీలు తింటే షుగర్‌ లెవల్స్‌ కూడా తగ్గుతాయి.

';

అలాగే రోగనిరోధక శక్తి పెంచేందుకు కూడా సహాయపడుతుంది.

';

కొర్రల రోటీల తయారీకి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల గోధుమ పిండి, 1/2 కప్పు కొర్రల పొడి, 1/4 కప్పు నెయ్యి, 1/2 టీస్పూన్ ఉప్పు, నీరు అవసరం మేరకు

';

తయారీ విధానం: ఒక గిన్నెలో గోధుమ పిండి, కొర్రల పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

అందులోనే నెయ్యి వేసి, కొద్ది కొద్దిగా నీరు పోస్తూ గట్టిగా కలుపుకోవాలి.

';

పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని చేతితో చదునుగా చేసి రోటీలాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

వేడి చేసిన తవ్వపై రోటీని వేసి రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

వేడి వేడిగా నెయ్యి, పచ్చడి లేదా సాంబార్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story