మిల్లెట్స్‌తో ఉప్మా.. తింటే బరువు, కొవ్వు ఇట్లే తగ్గుతారు..

Dharmaraju Dhurishetty
Jun 22,2024
';

మిల్లెట్స్ ఉప్మా ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రిస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది.

';

చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ప్రతి రోజు ఈ మిల్లెట్స్ ఉప్మా తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

అంతేకాకుండా ఇందులో ఉండే ఫైబర్‌ పొట్ట సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

';

మిల్లెట్స్ ఉప్మాలో రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వివిధ రకాల మిల్లెట్స్‌తో ఉంటాయి. కాబట్టి శరీరానికి తగిన పోషకాలను అందిస్తాయి.

';

మీరు కూడా ఇంట్లోనే సులభంగా మిల్లెట్స్ ఉప్మాను తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే..

';

కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మిల్లెట్స్ (రాగులు, జొన్నలు, సజ్జలు లేదా మిశ్రమం), 2 కప్పుల నీరు, 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీస్పూన్ జీలకర్ర

';

కావాల్సిన పదార్థాలు: 1/4 టీస్పూన్ ఆవాలు, 1/4 టీస్పూన్ ఉప్పు, 1/2 టీస్పూన్ కారం, 1/4 టీస్పూన్ పసుపు, 1/4 కప్పు తరిగిన కూరగాయలు (ఉల్లిపాయలు, క్యారెట్లు, బఠానీలు), 1/4 కప్పు తరిగిన కొత్తిమీర, నూనె

';

తయారీ విధానం: మిల్లెట్స్ ను శుభ్రంగా కడిగి రవ్వలాగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

';

ఈ రవ్వను దాదాపు 30 నిమిషాలు నానబెట్టుకోండి.

';

ఆ తర్వాత ఒక గిన్నెలో నూనె వేడి చేసి, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి.

';

జీలకర్రలు చిటపటలాడగానే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరిగిన కూరగాయలు వేసి, మెత్తబడే వరకు వేయించాలి.

';

నానబెట్టిన మిల్లెట్స్, నీరు, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలి. మిశ్రమం మరిగే వరకు ఉడికించాలి.

';

మిశ్రమం దగ్గరగా ఉడికిన తర్వాత, కొత్తిమీర వేసి కలపాలి. ఉప్మా ఉడికి, నీరు పూర్తిగా ఆవిరైపోయే వరకు ఉడికించాలి. అంతే రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story