పచ్చి కొబ్బరితో చికెన్.. ఈ ఆదివారం తప్పకుండా ట్రై చేయండి!

Dharmaraju Dhurishetty
Jan 03,2025
';

పచ్చి కొబ్బరితో ఎలాంటి ఆహార పదార్థాలు తయారుచేసిన చాలా అద్భుతంగా ఉంటాయి. కొబ్బరిపాలతో వివిధ రకాల రెసిపీలను తయారు చేసుకుంటూ ఉంటారు.

';

ముఖ్యంగా కేరళ లాంటి కొబ్బరి తోటలో అధికంగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా అన్ని ఆహార పదార్థాల్లో కొబ్బరిని వినియోగిస్తూ ఉంటారు.

';

కొబ్బరితో చేసిన ఆహారాలు తినడం వల్ల కూడా శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

';

ముఖ్యంగా కొంతమంది అయితే కొబ్బరితో చికెన్ కర్రీ కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఈ కర్రీని ఎలా తయారు చేసుకుంటారు మీకు తెలుసా?

';

పచ్చి కొబ్బరితో సులభంగా ఇంట్లోనే చికెన్ కర్రీని తయారు చేసుకోవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో? కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకోండి..

';

కావలసిన పదార్థాలు: చికెన్ - 1/2 కిలో, కొబ్బరి నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగిన), పచ్చిమిర్చి - 2 (చీలికలు), అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్, టమోటాలు - 2 (ముక్కలు)

';

కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు - 1 కప్పు, కారం - 1 టీ స్పూన్, ధనియాల పొడి - 1 టీ స్పూన్, గరం మసాలా - 1/2 టీ స్పూన్, పసుపు - 1/2 టీ స్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర - గార్నిష్ కోసం

';

తయారీ విధానం: ముందుగా పచ్చికొబ్బరి చికెన్ కర్రీని తయారు చేసుకోవడానికి.. చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి.

';

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నూనెను వేడి చేసి చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేంతవరకు బాగా వేపుకోండి.

';

అన్ని బాగా వేపుకున్న తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు కలుపుకుంటూ వేపుకోండి. అన్ని వేపుకున్న తర్వాత..అందులో టమాటా ముక్కలు వేసుకొని మెత్తబడేంత వరకు కలుపుతూ వేపుకోండి.

';

టమాటో ముక్కలు బాగా ఉడికిన తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

అన్నీ బాగా కలిపిన తర్వాత చికెన్ ముక్కలు వేసి ఉడికిన మసాలా చికెన్ ముక్కలకు పట్టేంతవరకు బాగా కలుపుతూ వేపుకోండి. చివరగా ఇందులో కొబ్బరి పాలను పోసుకొని దాదాపు పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించండి.

';

కొబ్బరి పాలు దగ్గరికి వచ్చి చికెన్ బాగా ఉడికిన తర్వాత గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపుకొని ఉడుకుడుకు అన్నంలో వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story