ఈ ఫ్రై రోజూ తింటే సింపుల్‌గా బరువు తగ్గడం ఖాయం.. నమ్మట్లేదా?

Dharmaraju Dhurishetty
Jan 03,2025
';

చాలామంది మిల్మేకర్ తినడం వల్ల బరువు బరువు పెరుగుతారని అనుకుంటారు. కానీ దీనిని తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.

';

మిల్ మేకర్లు ప్రోటీన్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు రోజు తినొచ్చు.

';

ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు మిల్ మేకర్ ఫ్రై చేసుకుని తింటే మంచి ఫలితాలు పొందుతారు. మీరు కూడా ఓసారి ట్రై చేయాలనుకుంటున్నారా?

';

బరువు తగ్గాలనుకునేవారు సులభంగా మిల్ మేకర్ ఫ్రైని ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి..

';

కావలసిన పదార్థాలు: మీల్ మేకర్ - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగిన), పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగిన), కరివేపాకు - 1 రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: కారం - 1 టీస్పూన్, ధనియాల పొడి - 1 టీస్పూన్, గరం మసాలా - 1/2 టీస్పూన్, పసుపు - 1/4 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - వేయించడానికి సరిపడా

';

తయారీ విధానం: ముందుగా ఈ ఫ్రై చేసుకోవడానికి మిల్ మేకర్స్ ను దాదాపు వేలినీటిలో 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా నానబెట్టుకున్న మిల్ మేకర్స్‌ని గట్టిగా నీరు పిండుతూ ఒక బౌల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని ఇలానే గట్టిగా నీరు లేకుండా పిండి తాజా బౌల్లోకి తీసుకోండి.

';

ఆ తర్వాత స్టౌపై ఓ బవులు పెట్టుకొని అందులో తగినంత నూనెను వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేపుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు బాగా వేపుకోండి. ఆ తర్వాత ఇందులోనే ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

అన్నీ బాగా కలిసిన తర్వాత మీల్ మేకర్ వేసి దాదాపు అందులో ఉన్న నీరంతా ఎగిరిపోయేంతవరకు బాగా కలుపుతూ ఉండండి.

';

ఫ్రై చేసే క్రమంలో అడుగు మాడకుండా చూసుకోండి. అవి బాగా క్రిస్పీగా అయిన తర్వాత తగినంత కొత్తిమీర వేసుకొని తింటే రుచికి రుచి, ప్రోటీన్ కి ప్రోటీన్ లభిస్తాయి.

';

VIEW ALL

Read Next Story