ఫాస్ట్‌గా బరువును తగ్గించే ఓట్స్‌ దోస రెసిపీ..

';

ఓట్స్ దోసలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ఈ దోసను కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునేవారు కూడా తినొచ్చు. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.

';

కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఓట్స్ పిండి, 1/2 కప్పు బియ్యప్పిండి, 1/4 కప్పు రవ్వ, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1/4 టీస్పూన్ మెంతులు

';

కావాల్సిన పదార్థాలు: 1/2 టీస్పూన్ పసుపు, 1/4 టీస్పూన్ కారం, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయలు, 1/4 కప్పు తరిగిన కరివేపాకు

';

కావాల్సిన పదార్థాలు: 1/4 కప్పు తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము, 2-3 పచ్చిమిర్చి ముక్కలు(తరిగినవి), 1 కప్పు పెరుగు, నీరు (తగినన్ని)

';

తయారీ విధానం: ఒక గిన్నెలో ఓట్స్ పిండి, బియ్యప్పిండి, రవ్వ, జీలకర్ర, మెంతులు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసి మళ్లీ బాగా కలపండి.

';

పెరుగు, కొద్దిగా నీరు కలుపుతూ, ముద్దలు లేకుండా పిండిని కలుపుకోండి. అవసరమైతే మరింత నీరు వేసి, పలుచని పిండిని కలుపుకోండి.

';

ఒక నాన్-స్టిక్ దోస పాన్‌ను మీడియం వేడి మీద వేడి చేసి కొద్దిగా నూనెతో బాగా స్ప్రెడ్‌ చేసుకోండి.

';

దోస పాన్‌పై పలుచగా, సమానంగా పిండి పోసి దోసలా తయారు చేసుకోండి.

';

దోస ఒక వైపు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు కాల్చుకుని మరో వైపు కాల్చుకోండి.

';

అంతే సులభంగా ఓట్స్‌ దోస రెడీ అయిన్నట్లే..

';

VIEW ALL

Read Next Story