కరకరలాడే హెల్తీ ఓట్స్‌ వడ.. తింటే ఎన్నో లాభాలు!

Dharmaraju Dhurishetty
Sep 12,2024
';

ఓట్స్‌తో చాలా మంది వివిధ రకాల రెసిపీలు తయారు చేసుకుంటూ ఉంటారు.

';

ఓట్స్‌తో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా పొట్ట సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

';

చాలా మంది ఓట్స్‌తో పోహా ఇతర ఆహార పదార్థాలు తయారు చేసుకుంటూ ఉంటారు.

';

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఓట్స్‌తో హెల్తీ వడా కూడా తయారు చేసుకోవచ్చు.

';

ఓట్స్‌తో తయారు చేసిన వడాను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి.

';

ఓట్స్‌ వడాకి కావలసిన పదార్థాలు: ఓట్స్: ముప్పావు కప్పు, శనగపప్పు: అర కప్పు (రెండు గంటలు ముందుగా నానబెట్టి, మిక్సీలో రుబ్బుకోవాలి)

';

కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ: అర కప్పు (సన్నగా తరుగుకోవాలి), పచ్చిమిర్చి: రెండు (సన్నగా తరుగుకోవాలి), కొత్తిమీర: చిన్న కట్ట (సన్నగా తరుగుకోవాలి)

';

కావలసిన పదార్థాలు: ధనియాల పొడి: ఒక స్పూన్, కారం: ఒక స్పూన్, ఉప్పు: రుచికి తగినంత, నీరు: తగినంత, నూనె: వడలు వేయడానికి తగినంత

';

తయారీ విధానం.. పిండి సిద్ధం చేయడం: ఒక పాత్రలో శనగపప్పు మిశ్రమం, ఓట్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

నీరు కలపడం: కొంచెం కొంచెంగా నీరు వేసి పిండిని కలుపుతూ..మిశ్రమాన్ని గట్టిగా లేదా నీరుగా లేకుండా బాగా మిక్స్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

';

వడలు వేయడం: కడాయిలో నూనె వేడి చేసి, చెంచా సహాయంతో పిండిని తీసుకుని వడల ఆకారంలో నూనెలో వేయాలి.

';

నూనెలో వేసుకున్న వడలను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే సులభంగా వడలు రెడీ అయినట్లే..

';

పెరుగు చట్నీ లేదా కారం పచ్చడితో సర్వ్ చేయండి.

';

VIEW ALL

Read Next Story