గ్రీన్ కలర్ లో ఉన్న క్యాప్సికం రెడ్, ఎల్లోలో ఉన్న కేలరీల కంటే తక్కువగా ఉంటాయి. ఇవి కొంచెం తియ్యగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఫైబర్, విటమిన్ కె, పొటాషియం కూడా అధిక మోతాదులో ఉంటుంది.
ఎల్లో క్యాప్సికం మితమైన తీపిని కలిగి ఉంటుంది. గ్రీన్ కంటే ఎక్కువ పరిపక్వం చెందుతాయి. రెడ్ కంటే తక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ తక్కువగా ఉన్నప్పటికీ విటమిన్ సి అధికమోతాదులో ఉంటుంది.
రెడ్ క్యాప్సికం తియ్యగా ఉంటుంది. తొందరగా పరిపక్వత చెందుతుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, ఎ, విటమిన్ బి6, ఫొలేట్, ఫైబర్ అధికంగా ఉంటుంది.
గ్రీన్ క్యాప్సికంలో కేలరీలు తక్కువ,పోషకాలు తుక్కువ. ఎల్లో క్యాప్సికంలో పుష్కలు పుష్కలంగా ఉంటాయి. రెడ్ క్యాప్సికంలో ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
మూడింటిలో ఏది ఆరోగ్యకరమైనది అనేది నిర్దిష్ట పోషకాల అవసరాలు, రుచిపై ఆధారపడి ఉంటుంది. మీ ఆహారంలో ఈ మూడింటిని చేర్చుకోవడం వల్ల పోషకాలన్నీ పొందవచ్చు.
క్యాప్సికం నిత్యం ఆహారంలో తీసుకోవాలని వైద్యు సూచిస్తుంటారు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తాయి. రోగనిరోదశక్తిని పెంచడంలో సహాయపడతాయి.