రోజు నానబెట్టిన బాదం తినడం మంచిదా.. ఎండినవి మంచివా?
Dharmaraju Dhurishetty
Sep 11,2024
';
రోజు ఉదయం బాదం పప్పులు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.
';
ఇందులో ఉండే పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది.
';
అంతేకాకుండా ప్రతి రోజు నానబెట్టిన బాదం తినడం వల్ల రెట్టింపు లాభాలు పొందుతారు.
';
జీర్ణక్రియ సమస్యలకు చెక్: నానబెట్టిన బాదం తినడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా పోషకాలు మన శరీరానికి సులభంగా అందుతాయి.
';
పోషక విలువలు: నానబెట్టిన బాదంలో ఎంజైమ్‌లు సులభంగా ఉత్పత్తి అవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఎండిన బాదం కంటే సులభంగా నానబెట్టిన బాదంలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.
';
విషపదార్థాలు: కొన్నిసార్లు, బాదం పప్పులో కొన్ని రకాల విషపదార్థాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే నీటిలో నానబెట్టుకుని తింటే తొలగిపోతాయి.
';
చర్మం: నానబెట్టిన బాదం చర్మానికి మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేసి, ముడతలు తగ్గిస్తుంది.
';
గుండె ఆరోగ్యం: రెండింటిలోనూ మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
';
బరువు తగ్గడం: రెండింటిలోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రెండు తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.
';
జుట్టు ఆరోగ్యం: బాదంలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తుంది.
';
ఎప్పుడు ఏది తినాలి: ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన బాదం తినడం చాలా మంచిది.