దక్షిణభారత వంటకాలు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. అందులో బ్రేక్ ఫాస్టు కూడా ఒకటి.
మనలో చాలా మంది రవ్వ ఉప్మా తినేందుకు ఆసక్తి చూపించరు. కానీ రవ్వ ఉప్మాను ఇలా చేసుకకుని తింటే ఇష్టంగా తింటారు.
1కప్పు రవ్వ, 3 కప్పుల నీరు, హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి, హాఫ్ టీస్పూన్ ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తురిమిన అల్లం, కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర
రవ్వును మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి.
నెయ్యి వేడి చేసి ఆవాలు వేయాలి. మినపప్పు, శనగ పప్పు బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి.
ఇప్పుడు జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తరుము వేసి వేయించుకోవాలి.
తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తర్వాత నీరు, ఉప్పు వేసి మరిగించాలి.
వేడి నీరు మరిగేటప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను వేసి కలపాలి.
ఇప్పుడు ఉప్మా రెడీ అయ్యింది. దానిపై కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.