Tasty Tamato Curry

ఎంతో రుచికరమైన టమాటా పప్పు తయారీ విధానం కోసం..ముందుగా ఒక గ్లాసు కందిపప్పు కడిగి నానబెట్టుకోవాలి.

Vishnupriya Chowdhary
Sep 13,2024
';

Tasty Tamato pappu

అరగంట అయిన తరువాత ఈ కందిపప్పు బాగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి.

';

Tamato dal

ఇప్పుడు బాణల్లో నూనె వేసుకొని.. అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆ తరువాత..సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి.

';

Tamato pappu

ఉల్లిపాయలు.. బంగారు రంగు వచ్చిన తర్వాత.. టమాటాలు, నాలుగు పచ్చిమిరపకాయలు, రెండు ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి.

';

Tamato Curry

ఇవన్నీ బాగా మగ్గాక.. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పులుసు తీసుకుని.. అందులో కలుపుకొని మరి కాసేపు ఉరకనివ్వాలి.

';

Tasty pappu

అందులో రెండు చెంచాల కారం, ఒక చెంచా ధనియాల పొడి.. కలుపుకోవాలి.

';

Tasty Tamato pappu for rice

ఈ మిశ్రమం బాగా దగ్గరకు వచ్చాక.. ముందుగా ఉడికించుకున్న కందిపప్పు మెత్తగా మెదిపి.. హ కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన టమాటా పప్పు రెడీ.

';

VIEW ALL

Read Next Story