Happy People: కొంతమంది ఎప్పుడూ సంతోషంగా ఉండటానికి ఇవే కారణాలు
కొంతమంది ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. వాళ్లకు సమస్యలు లేవని కాదు. ఎన్నిసమస్యలున్నా..హ్యాపీగా ఉంటారు. ఎందుకో తెలుసా?
సంతోషంగా ఉండేవారి అంచనాలు ఎప్పుడూ వారి అదుపులోనే ఉంటాయి. లక్ష్యాన్ని చేరుకోనప్పుడు కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు.
అసాధ్యమైన వాటి గురించి కలలు కనరు. సాధ్యమయ్యే వాటి గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు.
డబ్బు, విలువైన వస్తువులపై ఎక్కువ మోజు ఉండదు. విలువైన వస్తువులను కొనడానికి తొందరపడి మనశ్శాంతిని పాడుచేసుకోరు.
చిన్న చిన్న విషయాలు లేదా అవసరం లేని విషయాల గురించి అస్సలు పట్టించుకోరు. సమయాన్ని వేస్ట్ చేయరు.
తమకు తామే మొదటి ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. తర్వాతే ఇతరుల గురించి ఆలోచిస్తారు. స్వావలంబన కలిగి ఉంటారు.
చిన్న చిన్న ఆనందాలను వెతుక్కుంటారు. అపరిచితులను పలకరిస్తు చిరునవ్వు చిందిస్తుంటారు.
కష్టాలకు భయపడరు. మంచి, చెడు నుంచి చాలా నేర్చుకుంటారు. ఆనందం ఎక్కడ దొరుకుతుందో వెతుకుతుంటారు.
గాసిప్స్, రూమర్స్ గురించి అస్సలు పట్టించుకోరు. తమ గురించి ఎవరు చెడుగా మాట్లాడినా పట్టించుకోరు.