దక్షిణ భారతదేశంలో వన్యప్రాణులు భారీ సంఖ్యలో ఉన్నాయి. పులులు వాటి సహజ ఆవాసాలలో గుర్తించడానికి కొన్ని బెస్ట్ సఫారీలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
నీలగిరి బయెస్పియర్ రిజర్వ్ లో ఉన్న బంధీపూర్ భారత్ లో అత్యంత ప్రసిద్ధ టైగర్ రిజర్వ్ లలో ఒకటి. ఆకురాల్చే అడవులు, పచ్చికభూములు పులులకు అనువైన ఆవాసంగా ఉన్నాయి. పులులు దగ్గరి నుంచి చూడాలనుకునేవారికి ఇది బెస్ట్ ప్లేస్.
నీలగిరి అడవులు పులుల అవాసానికి అనువైన ప్రదేశం. ఉద్యానవనం, దట్టమైన అడవులు, గలగల పారే నదులు ఇక్కడ పులులను దగ్గరినుంచి చూడవచ్చు.
ముదుమలై కూడా దట్టమైన అడవులు. ఇక్కడ వన్య ప్రాణులకు అనువైన వాతావరణం ఉంటుంది. తెల్లవారుజామున ఇక్కడ పులుల చూడానికి అనువుగా ఉంటుంది.
పశ్చిమ కనుమలలో నెలకొని ఉన్న పెరియార్ అందమైన సరస్సు, సుందరమైన బోట్ సఫారీలకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ అరుదైన వన్యప్రాణాలు ఉన్నాయి. ప్రక్రుతి ప్రేమికులను అడవి అందాలు కట్టిపడేస్తాయి.
పశ్చిమ కనుమలలో ఉన్న భద్ర ఇక్కడ పులులు, ఏనుగులు, చిరుతపులులను దగ్గరి నుంచి చేసే అవకాశం లభిస్తుంది.
ఇందిరాగాంధీ వన్యప్రాణుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు. అనమలైలో పులులకు హాట్ స్పాట్.
గతంలో దండేలి అన్షి అని పిలిచేవారు. కాళీ టైగర్ రిజర్వ్ దాని భూభాగం దట్టమైన అడవులకు ప్రసిద్ధి చెందింది.
బెంగళూరుకు సమీపంలో ఉన్న బన్నెరఘట్ట ఎక్కువ దూరం ప్రయాణించకుండా పులులను చూడాలనుకునేవారికి బాగుంటుంది.