ఈ ఆకు కూర తింటే.. రక్తహీనత, బరువు తగ్గడం సమస్యలకు చెక్!

Dharmaraju Dhurishetty
Sep 18,2024
';

తోటకూర, పెసరపప్పు రెసిపీని క్రమం తప్పకుండా తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.

';

తోటకూరలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజు తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

';

పెసరపప్పులో ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. శరీర బరువు నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

తోటకూరలో ఉండే మూలకాలు జీర్ణక్రియ మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.

';

అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తహీనత నివారణకు ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

కావలసిన పదార్థాలు: తోటకూర - 1 కట్ట, పెసరపప్పు - 1 కప్పు, ఉల్లిపాయ - 2 (తరిగినవి), తోమటోలు - 2 (తరిగినవి)

';

కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి - 2-3 (తరిగినవి), అల్లం - చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు - 4-5, కారం పొడి - 1/2 టీస్పూన్, కొత్తిమీర - కట్ చేసి

';

కావలసిన పదార్థాలు: నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, కారం - రుచికి తగినంత, కసూరి మేతి - 1/2 టీస్పూన్

';

తయారీ విధానం..పప్పు నానబెట్టడం: పెసరపప్పును కడిగి, తగినంత నీటిలో 2-3 గంటలు నానబెట్టండి.

';

తోటకూర తయారు చేసుకోవడం: తోటకూరను బాగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కోసి, నీటిలో కడిగి పక్కన పెట్టుకోండి.

';

తయారీ ప్రక్రియ: ఒక పాత్రలో నూనె వేసి వేడి చేయండి. ఆ నూనెలో అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించండి.

';

ఆ తర్వాత ఉల్లిపాయలు, టమోటోలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగించాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత పప్పును కడిగి, వేగించిన మసాలాలో వేసి కలపండి. అందులోనే కారం పొడి, ఉప్పు, కారం వేసి బాగా కలపండి.

';

అన్ని మిక్స్‌ చేసిన తర్వాత తోటకూరను వేసి కలపండి. తగినంత నీరు పోసి, మూత పెట్టి మరిగించండి.

';

నీరు అయిపోయి, పప్పు మృదువుగా అయ్యే వరకు ఉడికించండి. ఆ తర్వాత కొత్తిమీర, కసూరి మేతి వేసి కలపండి. అంతే తోటకూర పప్పు రెడీ అయినట్లే..

';

VIEW ALL

Read Next Story