Pan Clean Tips:

ఇలా చేస్తే పెనంపై అతుక్కోకుండా దోశలు వేసుకోవచ్చు

Ravi Kumar Sargam
Dec 27,2024
';

వంటలు పాడవడం

పెనం శుభ్రం లేకపోతే దోశలు అతుక్కుపోతాయి. తీయడానికి రాకుండా పిండి వృథా అవుతుంది. ఇక చపాతీలు, భక్ష్యాలు సక్రమంగా కాలవు. దీంతో వంటలు పాడవుతాయి.

';

నల్లటి పొర

చపాతీ, దోస చేసుకున్న తర్వాత పెనం చుట్టూ నల్లటి పొర పేరుకుపోతుంది. అది ఉంటే దోశలు, చపాతీలు సరిగ్గా కాలవు.

';

గోధుమ పిండి

పెనం చక్కగా శుభ్రం చేయడానికి కేవలం ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి చాలు. ఈ జిగట లేదా జిడ్డును తొలగించడానికి ముందుగా సబ్బును చిన్న ముక్కలుగా చేసి పాన్ మీద వేయండి. దానిపై గోధుమ పిండిని వేయండి.

';

నూనె వేయాలి

సబ్బు, పిండి మిశ్రమాన్ని వేశాక 3 నిమిషాలు పాన్‌ను వేడి చేయాలి. అనంతరం నూనె వేయండి. జిగట, జిడ్డు మాయమయ్యే వరకు 2-3 నిమిషాలు వేడి చేసి సబ్బు, పిండి మిశ్రమాన్ని పాన్ చుట్టూ తిప్పాలి.

';

నురుగు

ఇలా చేయడం వల్ల నురుగు వచ్చి పెనంపై జిడ్డు పెనం నుంచి విడిపోతుంది. పెనంపై ఉన్న సబ్బు, పిండి మిశ్రమానికి కొంచెం నీరు వేయాలి. అనంతరం ఆ నీటిని పాన్ చుట్టూ తిప్పాలి.

';

జిడ్డు దూరం

కొన్ని నిమిషాలు అలాగే ఉంచిన అనంతరం మొత్తం జిడ్డు వదులుతుంది. అనంతరం పాన్‌ను సాధారణంగా మీరు కడిగే రీతిలో కడిగేసుకోవచ్చు.

';

పెనం శుభ్రం

ఐదు నిమిషాలు సమయం పట్టే ఈ చిట్కాతో మీ పెనం శుభ్రమవుతుంది. ఎంచక్కా దోశలు, చపాతీ, ఆమ్లెట్‌ వంటివి వేసుకోవచ్చు.

';

వాసన మాయం

ఈ విధంగా చేయడం వలన గతంలో వండుకున్న ఆహార పదార్థాల వాసన కూడా రాదు.

';

VIEW ALL

Read Next Story