వేసవికాలం వచ్చేసింది. తరచూ ఏదో ఒకటి తాగాలి అనిపిస్తుంది.
మరి ఈ వేసవి కాలంలో పానీయాలు తాగి కూడా బరువు తగ్గొచ్చు అని మీకు తెలుసా? అవును కింద చెప్పిన పానీయాలు తాగితే చాలు ఇట్టే బరువు తగ్గొచ్చు
పుదీనా ఆకులను రసముగా చేసుకొని అందులో నల్ల ఉప్పు.. తేనా కలుపుకొని తాగితే బరువు అదుపులో ఉంటుంది.
ఈ వాటర్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పానీయం తీసుకుంటే వేసవికాలం డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండడమే కాకుండా బరువు కూడా అదుపులో పెట్టొచ్చు
పచ్చి మామిడి కాయలను ఉడకపెట్టుకొని ఆ గుజ్జులో పుదీనా ఆకులు, నీరు.. వేయించిన నల్ల ఉప్పు జీలకర్ర పొడి కాస్త తేనె కలిపి తాగితే బరువు తగ్గడానికి ఉపయోగ పడుతుంది.
మజ్జిగ చేసుకుని అందులో జీలకర్ర పొడి వేసుకొని తాగితే.. ఈ పానీయం బరువుని అదుపులో పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది
కొబ్బరి నీరు వేసవికాలంలో దాహం తీర్చడమే కాకుండా మనం బరువు కూడా పెరగకుండా చూసుకుంటాయి..