జీవితంలో ఒక్కసారైనా

అతిపెద్ద సరస్సులు భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. ప్రకృతి అందాలు.. జలకాలాట చేస్తే జీవితంలో ఇలాంటి మధురానుభూతి పొందుతారు. జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సి ఉంది.

';

నాగార్జున సాగర్ సరస్సు

Indian Lakes Tour: తెలంగాణలోని నాగార్జున సాగర్‌ సరస్సు దాదాపు 285 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. కృష్ణా నదిపై నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా ఈ సరస్సు ఏర్పాటు చేశారు. ఈ సరస్సుతో నీటి పారుదల, జలవిద్యుత్, తాగునీటి సరఫరా అందుతోంది.

';

పులికాట్ సరస్సు

Indian Lakes Tour: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దున ఉన్న పులికాట్‌ సరస్సు సుమారు 450 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దేశంలో రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు.

';

చిలుకా సరస్సు

Indian Lakes Tour: ఒడిశాలో ఉన్న చిలుకా సరస్సు సుమారు 1,165 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంది. దేశంలోనే అతిపెద్ద తీర సరస్సు. అంతేకాకుండా ప్రపంచంలోనే రెండో అతి పెద్దది. వలస పక్షులను చూసి ఆనందించవచ్చు.

';

వెంబనాడ్ సరస్సు

Indian Lakes Tour: కేరళలోని వెంబనాడ్ సరస్సు సుమారు 2,033 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది బ్యాక్ వాటర్స్, హౌస్ బోట్లకు ప్రసిద్ధి చెందింది.

';

శివ సాగర్ సరస్సు

Indian Lakes Tour: మహారాష్ట్రలోని శివ సాగర్ సరస్సు సుమారు 891.7 చదరపు కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇది కృత్రిమ సరస్సు కావడం విశేషం. కోయినా ఆనకట్ట ద్వారా సృష్టించబడిన ఈ సరస్సు దేశంలోనే అతిపెద్ద కృత్రిమ సరస్సు. ఇది ప్రధాన జలవిద్యుత్ ప్రాజ

';

సర్దార్ సరోవర్ సరస్సు

Indian Lakes Tour: గుజరాత్‌లోని సర్దార్ సరోవర్ సరస్సు 375 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ ద్వారా సృష్టించబడింది. నీటిపారుదల, నీటి సరఫరా, విద్యుత్ ఉత్పత్తికి ఈ సరస్సు దోహదం చేస్తుంది.

';

పాంగోంగ్ త్సో సరస్సు

Indian Lakes Tour: జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్‌లో ఉన్న అందమైన సరస్సు పాంగోన్ త్సో. హిమాలయ పర్వతాల నడుమ కొలువైన ఈ సరస్సు 700 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉంది. మన దేశం నుంచి చైనా వరకు విస్తరించి ఉన్న ఈ సరస్సు ఎత్తైన ప్రదేశంలో ఉండడం విశేష

';

ఇందిరా సాగర్ సరస్సు

Indian Lakes Tour: ఈ సరస్సు మధ్యప్రదేశ్‌లో ఉంది. దీని వైశాల్యం దాదాపు 627 చదరపు కిలోమీటర్లు. నర్మదా నదిపై ఇందిరా సాగర్ డ్యామ్ ద్వారా ఈ సరస్సు ఏర్పాటైంది. ఇది నీటిపారుదల, జలవిద్యుత్ కోసం ఈ సరస్సు కీలకమైనది.

';

VIEW ALL

Read Next Story