లంచ్‌ బాక్స్‌లోకి బ్రెడ్ ప్యాటీస్.. పిల్లలు వదలకుండా తింటారు!

Dharmaraju Dhurishetty
Dec 25,2024
';

బ్రెడ్ ప్యాటీస్ ఎంతో సుభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసా?

';

పిల్లల లంచ్ బాక్స్‌లో బ్రెడ్ ప్యాటీస్‌ను కూడా ఇవ్వొచ్చు. వీటిని మీరు కూడా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి.

';

కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ - 6, ఉడికించిన బంగాళాదుంపలు - 2 (పెద్దవి), ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)

';

కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి - 2 (చిన్నగా తరిగిన), అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 టీస్పూన్, కారం - 1/2 టీస్పూన్, గరం మసాలా - 1/4 టీస్పూన్

';

కావలసిన పదార్థాలు: చాట్ మసాలా - 1/4 టీస్పూన్, కొత్తిమీర - కొద్దిగా (చిన్నగా తరిగిన), నూనె - వేయించడానికి సరిపడా, ఉప్పు - రుచికి సరిపడా

';

తయారీ విధానం: ముందుగా వీటిని తయారు చేసుకోవడానికి ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది.

';

ఇలా వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి.. పచ్చి వాసన పోయే వరకు మరి కాస్త సేపు వేయించుకోవాల్సి ఉంటుంది.

';

ఇప్పుడు మాష్ చేసిన బంగాళాదుంప, కారం, గరం మసాలా, చాట్ మసాలా..ఇలా అన్నింటిని వేసుకుని ఉప్పు వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

';

అన్ని బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసి ఒక నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.

';

ఇక బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి అంచులు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఒక బ్రెడ్ స్లైస్ మీద తయారుచేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని పెట్టుకుని మరో బ్రెడ్ స్లైస్‌తో బాగా కప్పాల్సి ఉంటుంది..

';

ఇప్పుడు వీటిని మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

పాన్‌లో నూనె వేడి చేసి ఇలా తయారు చేసుకున్న ప్యాటీస్‌ను బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story