ఎనర్జీ-ఎఫిషియెంట్ పరికరాలు ఉపయోగించడం ద్వారా మీరు శక్తిని ఆదా చేయవచ్చు. ముఖ్యంగా LED బల్బులు వాడండి.
ఇంటి లోని పరికరాలను ఆఫ్ చేయడం చాలా ముఖ్యమైంది. వాడకుండా ఉండే పరికరాలు, లైట్లు ఆఫ్ చేయడం ద్వారా కరెంట్ బిల్ తగ్గుతుంది. ముఖ్యంగా ఏసి వెయ్యనప్పుడు.. స్టెబిలైజర్ కూడా ఆపి పెట్టడం మంచిది.
వాటర్ ప్యూరిఫైయర్ లాంటివి కూడా.. నిండిన వెంటనే ఆపిపెట్టేయడం మంచిపని.
సోలార్ ఎనర్జీ ఉపయోగించడం ద్వారా.. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా మీ కరెంట్ బిల్‌ను మరింత తగ్గిస్తుంది.
పరికరాల నిర్వహణ జాగ్రత్తగా చేసుకుంటే, వాటి పనితీరు మెరుగుపడుతుంది. గట్టి కేబుల్స్, ఎఫిషియెంట్ ఫ్యాన్స్ వాడటం చాలా మంచిది.
హీటింగ్ మరియు కూలింగ్ పరికరాలకు టైమర్ అమలు చేయడం ద్వారా, మీకు కావాల్సిన సమయంలోనే కరెంటు ని వినియోగించవచ్చు.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.