ఇది తింటే మీరు అనుకోలేనంత బరువు తగ్గుతారు..

Dharmaraju Dhurishetty
Jul 28,2024
';

శరీర బరువును నియంత్రించుకోవడానికి తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ఎంతో ముఖ్యం..

';

అలాగే శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే తప్పకుండా రోజు ఉదయం గంటపాటు వాకింగ్ తో పాటు వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది.

';

అన్నిటికంటే ముఖ్యమైనది బరువు తగ్గడానికి తప్పకుండా ప్రతిరోజు ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది.

';

బరువు తగ్గే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో అనారోగ్యకరమైన ఆహారాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

వెయిట్ లాస్ అయ్యే క్రమంలో తప్పకుండా ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు మాత్రమే తీసుకోవాలి.

';

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల పొట్ట ఎప్పుడు నిండుగా ఉంటుంది. దీని కారణంగా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ముఖ్యంగా బరువు తగ్గడానికి అత్యంత ఎఫెక్టివ్ రెసిపీలో బ్రోకలీ సలాడ్ ఒకటి..

';

రోజు ఉదయం అల్పాహారంలో భాగంగా బ్రోకలీ సలాడ్ ను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు.

';

మీరు కూడా సులభంగా బరువు తగ్గడానికి బ్రోకలీ సలాడ్ని తినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా తయారు చేసుకోండి.

';

బ్రోకలీ సలాడ్ తయారీకి కావలసిన పదార్థాలు: బ్రోకలీ - 1 కప్పు, క్యారెట్ - 1 కప్పు, బచ్చలికూర - ఒక కట్ట, నూనె - 2 టేబుల్ స్పూన్లు

';

పదార్థాలు: వెల్లుల్లి రేకులు - 2, ఉప్పు - రుచికి తగినంత, మిరియాలు - రుచికి తగినంత, నిమ్మరసం - 1 నిమ్మకాయ, కొత్తిమీర - కొద్దిగా (చిన్నగా తరిగినది)

';

తయారీ విధానం: బ్రోకలీ, క్యారెట్‌ను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి.

';

ఒక పాత్రలో నీరు మరిగించి అందులో బ్రోకలీ, క్యారెట్ ముక్కలు వేసి 2-3 నిమిషాలు ఉడికించి చల్లార్చుకోండి.

';

బచ్చలికూరను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి.

';

ఒక పాన్‌లో నూనె వేసి వేడి చేసి అందులో వెల్లుల్లి రేకులు వేసి వేగించండి.

';

వేగించిన వెల్లుల్లిని ఒక బౌల్‌లోకి తీసి బ్రోకలీ, క్యారెట్, బచ్చలికూర ముక్కలు, ఉప్పు, మిరియాలు, నిమ్మరసం వేసి బాగా కలపండి.

';

చివరగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలు.. ఇలా తయారు చేసుకున్న బ్రోకలీస్ సలాడ్ని రోజు ఉదయం తినండి.

';

VIEW ALL

Read Next Story