ప్రస్తుతం ఎంతో మందిలో అధిక బరువు, తక్కువ కాల్షియం.. సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి వారి కోసమే ఈ జొన్న కిచ్చిడి..
ముందుగా ఒక కప్పు జొన్నలను.. బాగా శుభ్రం చేసుకోవాలి. దీనిని రాత్రంతా నానబెట్టుకోవాలి.
ఉదయాన్నే ఈ జొన్నలకు.. రెండు గ్లాసులు నీళ్లు చేర్చి.. కుక్కర్లో మూడు విజలు వచ్చేదాకా..ఉంచుకోవాలి.
తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి…ఒక కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకుని.. చిటపటలాడించాలి.
తరువాత అందులో మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలి.. తరువాత చిన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయ ముక్కలను.. కూడా వేసుకోవాలి.
ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న.. ఒక క్యారెట్ ముక్కలు.. ఒక చిన్న కప్పు క్యాబేజీ తురుము.. చిన్న కప్పు బఠాణి, నానబెట్టుకున్న పెసలు.. వేసుకుని వేయించుకోవాలి.
చివరిగా ఉడికించిన జొన్నలను కూడా వేసుకొని.. ఐదు నిమిషాలు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత.. వేయించుకున్న జీడిపప్పు, వేరుశనగపప్పును కూడా వేసి కలుపుకోవాలి.
అంతే రుచికరమైన జొన్న కిచిడి సిద్ధం. షుగర్, బీపీ, థైరాయిడ్ ఉన్నవారు ఎవరైనా.. ఈ రుచికరమైన ఆహారాన్ని తీసుకోవచ్చు.