ప్రతిరోజు మొక్కజొన్న పిండితో తయారు చేసుకున్న రోటీలు తినడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు దూరం అవుతాయి.
';
ముఖ్యంగా మొక్కజొన్న పిండితో తయారుచేసిన రోటీలు తింటే శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.
';
మొక్కజొన్న రోటీలను మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా ట్రై చేయండి..
';
మొక్కజొన్న రోటీలకు కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పిండి - 1 కప్పు, గోరువెచ్చని నీరు - తగినంత, ఉప్పు - రుచికి తగినంత, నెయ్యి లేదా నూనె - రోటీ కాల్చడానికి
';
తయారీ విధానం: ముందుగా ఈ రోటీలను తయారు చేసుకోవడానికి మొక్కజొన్న పిండిని తీసుకొని జల్లించి పక్కన పెట్టుకోండి.
';
ఇలా జల్లించి పక్కన పెట్టుకున్న మొక్కజొన్న పిండిలో ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని వేసుకుని మెత్తని పిండిలా కలుపుకోండి.
';
పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని బాగా నాననివ్వండి.
';
పిండి బాగా నానిన తర్వాత రోటీలను చేతితో బాగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న రోటీలను పెనం పెట్టి నెమ్మదిగా కాల్చుకోండి.
';
కాల్చుకునే సమయంలో రెండు వైపులా నెయ్యి లేదా నూనె వేస్తూ నెమ్మదిగా కాల్చుకుంటే అద్భుతమైన టేస్టీ తో కూడిన రోటీలను పొందుతారు.