ఉదయాన్నే ఈ ఉప్మా తింటే వ్యాయమం చేయకుండానే బరువు తగ్గుతారు..

';

జొన్న రవ్వ ఉప్మాలో శరీరానికి కావలసిన ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరిచి శరీర బరువును నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.

';

అలాగే జొన్న ఉప్మాను తినడం వల్ల శరీరానికి తగిన మోతాదులో ఐరన్, మెగ్నీషియం లభిస్తాయి. దీని కారణంగా ఎముకలు దృఢంగా తయారవుతాయి.

';

జొన్న ఉప్మాను తినడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి రోజు జొన్న ఉప్మాను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

జొన్న ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు: జొన్న రవ్వ - 1 కప్పు, ఉల్లిపాయ - 1 (తరిగినది), కరివేపాకు - 1 రెమ్మ, పచ్చి మిరపకాయలు - 2 (తరిగినవి)

';

కావలసిన పదార్థాలు: ఆవాలు - 1 టీస్పూన్, జీలకర్ర - 1 టీస్పూన్, పసుపు - 1/2 టీస్పూన్, మిరపకాయ పొడి - 1 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర - (అలంకరించడానికి)

';

తయారీ విధానం: ముందుగా ఈ ఉప్మా తయారు చేయడానికి పాన్ లో ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి.. ఆ తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.

';

జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

';

కరివేపాకు, పచ్చి మిరపకాయలు వేసి వేయించాలి. ఆ తర్వాత ఇందులోనే జొన్న రవ్వ వేసి 2 నిమిషాలు వేయించాలి.

';

అవి బాగా వేగిన తర్వాత పసుపు, మిరపకాయ పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.

';

ఈ బౌల్ ను పక్కకు దింపి మరొకలాయి పెట్టుకుని అందులో రవ్వకు సరిపడా నీటిని పోసుకొని బాగా మరిగించుకోవాలి.

';

నీరు బాగా మరుగుతున్న సమయంలోనే పోపు పెట్టుకున్న రవ్వను ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

';

ఈ రవ్వ మిశ్రమాన్ని మిక్స్ చేసుకునే క్రమంలో ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ.. మూత పెట్టి ఉప్మా తయారయ్యే అంతవరకు బాగా ఉడికించుకోవాలి.

';

VIEW ALL

Read Next Story