ఈ రవ్వతో ఉప్మా.. రోజు తింటే బరువు, కొలెస్ట్రాల్ సమస్యలు మాయం!

Dharmaraju Dhurishetty
Dec 26,2024
';

మొక్కజొన్న రవ్వతో తయారు చేసిన ఉప్మా రోజు తినడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

మొక్కజొన్న రవ్వ చేసి ఉప్మా తింటే బరువు, శరీర కొలెస్ట్రాల్ సమస్యలు దూరమవుతాయి.

';

తరచుగా మొక్కజొన్న రవ్వతో చేసిన ఉప్మాను తింటే దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయట. అయితే మీరు కూడా దీనిని ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే తయారు చేసుకోండి ఇలా..

';

మొక్కజొన్న ఉప్మా తయారీ విధానం, కావలసిన పదార్థాలను తెలుసుకోండి.

';

కావలసిన పదార్థాలు: 1 కప్పు మొక్కజొన్న రవ్వ, 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ, 1/2 కప్పు తరిగిన టమోటా, 1/4 కప్పు తరిగిన క్యారెట్

';

కావలసిన పదార్థాలు: 1/4 కప్పు తరిగిన బఠానీలు, 1/4 కప్పు నూనె, 1 టీస్పూన్ ఆవాలు, 1 టీస్పూన్ జీలకర్ర

';

కావలసిన పదార్థాలు: 1/2 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ కారం, 1/2 టీస్పూన్ ఉప్పు, 1/4 కప్పు కొత్తిమీర

';

తయారీ విధానం: ముందుగా మొక్కజొన్న రవ్వను ఒక గిన్నెలో తీసుకొని కొలతతో పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఆ రవ్వను నూనె వేసి వేపుకోండి.

';

వేపుకున్న మొక్కజొన్న రవ్వను తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో పోపు దినుసులు వేసుకొని వేపుకోండి.

';

వేపుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేంతవరకు బాగా వేపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత టమోటా, క్యారెట్, బఠానీలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.

';

ఆ తర్వాత మొక్కజొన్న రవ్వకు సరిపడా నీటిని వేసుకుని అందులోనే కావలసినంత ఉప్పు కలుపుకొని.. పోపులో కోసుకొని బాగా ఉడికించుకోండి.

';

ఇలా ఉడికించుకున్న తర్వాత అందులో రవ్వను వేసుకొని మూత పెట్టి 15 నిమిషాల వరకు బాగా లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి.

';

బాగా ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని.. నెయ్యి వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రుచి వేరే లెవల్ ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story