పిల్లలు ఇష్టంగా తినే బిస్కెట్లను గోధుమపిండితో చేసుకోవడానికి.. ముందుగా ఒక కప్పు గోధుమపిండి జల్లించి వేసుకోవాలి.
ఆ పిండిలోనే ⅛ స్పూన్ జాజికాయ పొడి, కొద్దిగా యాలకుల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని పొడిగా కలుపుకోవాలి.
కొద్దిగా నెయ్యను కరిగించుకొని గిన్నెలో వేసుకొని.. అందులోనే పావు కప్పు పంచదార పొడిని వేసుకోవాలి. నెయ్యి, చక్కెర బాగా కరిగేదాకా గిలక్కొంటుకుంటూ కలుపుకుంటూ మిశ్రమం తయారు చేసుకోవాలి.
దీన్ని ముందుగా కలుపుకున్న మనం కలిపి పెట్టుకున్న పొడి పదార్థాల్లో కలిపి.. మొత్తాన్ని నీళ్లు పోసుకుంటూ గట్టిగా పిండి ముద్ద కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ పిండిని ముద్దలా చేసుకుని.. చపాతీలా రుద్దుకోవాలి. వాటినే బిస్కెట్ల ఆకారంలో కత్తితో కోసుకోవాలి.
బిస్కట్లు ఉడకడానికి మధ్యలో ఫోర్క్ తో గాట్లు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పైన కథాయి పెట్టి అరకేజీ దాకా ఉప్పు పోసుకోవాలి. అది వేడెక్కాక దానిపైన ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న బిస్కట్లను ఒక ప్లేట్ మీద సర్దాలి.
ఇప్పుడు ఆ ప్లేట్ ని స్టాండ్ మీద పెట్టుకోవాలి. దీనిని మూత పెట్టి కనీసం పావుగంట సేపు అలానే వదిలేస్తే. బిస్కట్లు రెడీ అవుతాయి.