రాత్రి భోజనం చేయడానికి ఏది సరైన సమయం..?
ప్రతి రోజు ఆహారంలో రాత్రి తీసుకునే ఆహారంపైనే మన జీవన శైలి, ఆరోగ్యం పై ఆధారపడి ఉంటుంది.
నిత్యం ఆరోగ్య కరంగా ఉండాలంటే ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య తినాలని డైటీషన్స్ సిపార్సు చేస్తున్నారు.
కడుపులో యాసిడ్ వంటి సమస్యలను నివారించడానికి పడుకునే ముందు కనీసం మూడు గంటల ముందు భోజనం చేయడం ఉత్తమం అని చెబుతున్నారు.
అంతేకాదు ప్రతి రోజు ఒక క్రమ పద్ధతిలో ఒకే సమయంలో భోజనం చేయడం కూడా ఉత్తమమైనది.
ప్రతి రోజు భోజనానికి ఖచ్చితమైన సయమం కేటాయించడం ఎంతో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.
జీర్ణ సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు మూడు గంటల ముందు రాత్రి భోజనం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొంతుతారు. జీర్ణ ప్రక్రియ వేగంపెరుగుతుంది.
మీరు బాగా పనిచేసినప్పుడు తినడం ఎంతో ముఖ్యం. మీకు అర్థరాత్రి ఆకలిగా అనిపిస్తే, తినడం మంచిది, కానీ ఆరోగ్యకరమైన, తేలికపాటి ఆహారాన్ని ఎంచుకోవడం ఉత్తమం.