ఇది రాస్తే తెల్ల జుట్టు మాయం.. చుండ్రుకు చెక్!

Dharmaraju Dhurishetty
Jun 28,2024
';

మందారం పువ్వు నూనెలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

';

జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు కూడా మందారం పువ్వు నూనె కీలక పాత్ర పోషిస్తుంది.

';

మందారం పువ్వు నూనె జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు వృద్ధిని వేగవంతం చేస్తుంది.

';

మందారం పువ్వు నూనె యాంటీఫంగల్, యాంటీబాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి చుండ్రును కలిగించే శిలీంధ్రాలను చంపడానికి సహాయపడతాయి.

';

మందారం పువ్వు నూనె జుట్టు మెరుపును పునరుద్ధరించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.

';

అంతేకాకుండా ఈ నూనెలో ఉండే గుణాలు జుట్టును మృదువుగా, మెత్తగా చేయడానికి సహాయపడుతుంది.

';

మందారం పువ్వు నూనె తలకు చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే దురదను తగ్గిస్తుంది.

';

మందారం పువ్వు నూనె తయారీకి కావలసినవి: తాజా మందారం పువ్వులు - 10 నుంచి 12, నూనె - 250 మి.లీ

';

తయారీ విధానం: మందారం పువ్వులను శుభ్రంగా కడిగి, నీటిని పూర్తిగా ఆరనివ్వాల్సి ఉంటుంది..

';

ఒక గిన్నెలో నూనె పోసి, మీడియం వేడి మీద వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత, మందారం పువ్వులను వేసి బాగా కాగనివ్వండి.

';

మందారం పువ్వులు వేగంగా బంగారు గోధుమ రంగులోకి మారుతుంది.

';

పువ్వులు రంగు మారిన తర్వాత, 10 నుంచి 15 నిమిషాలు నెమ్మదిగా నూనెను మరిగించాలి.

';

పువ్వులు పూర్తిగా గోధుమ రంగులోకి మారి, నూనె చిక్కగా మారిన తర్వాత వడకట్టి శుభ్రమైన సీసాలో నిల్వ చేయండి.

';

VIEW ALL

Read Next Story