తులసి మొక్కలో ఈ సంకేతాలు కన్పిస్తే ఇక మీకు మంచి రోజులు ప్రారంభమైనట్టే
హిందూమతంలో తులసి మొక్కకు విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంది. అత్యంత పవిత్రంగా భావిస్తారు. శుభసూచకంగా పరిగణిస్తారు. ప్రతి ఇంటి ఆవరణలో తప్పకుండా ఉంటుంది.
ఇంట్లో తులసి మొక్క పెంచుకుంటే ఆ ఇంట్లో సుఖ శాంతులుంటాయంటారు. దాంతోపాటు కుటుంబంలో ఆనందం వర్ధిల్లుతుంది.
తులసి మొక్క లక్ష్మీదేవికి ఆవాసంగా పరిగణిస్తారు. అందుకే తులసి మొక్కను విధిగా పూజలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమౌతుందని నమ్మకం.
హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్టలో ఉన్న తులసి మొక్క వివిధ రకాల సంకేతాలు ఇస్తుందట. ఈ సంకేతాలన్నీ ఆ మనిషి భవిష్యత్ గురించి సూచనలే
తులసి మొక్క ఒక్కసారిగా పచ్చగా ఏపుగా పెరగడం గమనిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కురవనుందని అర్ధం. భవిష్యత్తులో ఆర్ధికంగా లాభం కలగనుంది
లక్ష్మీదేవి కటాక్షంతో పాటు విష్ణువు కృప కూడా లభిస్తుందంటారు. ఇంట్లో శాశ్వతంగా సుఖ శాంతులు, ఐశ్వర్యం ఉంటాయి. డబ్బు కొరత ఎప్పటికీ రాదు
జ్యోతిష్యం ప్రకారం తులసి మొక్క చుట్టూ చిన్న చిన్న మొక్కలు మొలకెత్తుతుంటే మంచి జరగనుందని అర్ధం. ఇంట్లో నిధి వస్తుందని సంకేతం. లక్ష్మీదేవీ కటాక్షం కురవనుంది
తులసి మొక్క చుట్టూ గడ్డి మొక్కలు మొలిస్తే శుభంగా భావిస్తారు. ఆ వ్యక్తి ఆర్ధిక పరిస్థితి పటిష్టం కానుందని అర్ధం
తులసి మొక్కకు పూలు పూచాయంటే శుభం జరగనుందని అర్ధం. లక్ష్మీదేవి కటాక్షం లభించబోతుందని సంకేతం
తులసి మొక్క చుట్టూ నిర్ణీత పద్ధతిలో నెయ్యితో దీపం వెలిగించడం మంచిదంటారు. దీనివల్ల అంతా మంచి జరుగుతుందంటారు