IPL 2024: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి... రైనాను వెనక్కి నెట్టి IPLలో తొలి క్రికెటర్ గా..!

Published by: Samala Srinivas | Apr 07, 2024

విరాట్ కోహ్లి సెంచరీ:

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 113 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌ ఆడాడు. అయినా సరే ఆర్సీబీ ఓడిపోయింది. బట్లర్ సెంచరీతో రాజస్థాన్ గెలిచింది.

Published by: Samala Srinivas | Apr 07, 2024

కోహ్లీ అరుదైన రికార్డు

కోహ్లీ సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు. సురేశ్ రైనాను వెనక్కి నెట్టి ఈ రికార్డును తన పేరిట లఖించుకున్నాడు.

Published by: Samala Srinivas | Apr 07, 2024

నంబర్-1 కోహ్లీ

ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నంబర్-1 ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్‌లో అతని పేరిట 110 క్యాచ్‌లు ఉన్నాయి.

Published by: Samala Srinivas | Apr 07, 2024

సురేశ్ రైనా

ఈ జాబితాలో సురేశ్ రైనా 109 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.

Published by: Samala Srinivas | Apr 07, 2024

కీరన్ పొలార్డ్

ఈ లిస్ట్ లో కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పొలార్డ్ ఐపీఎల్ లో 103 క్యాచ్‌లు పట్టాడు.

Published by: Samala Srinivas | Apr 07, 2024

రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ పేరిట 99 ఐపీఎల్ క్యాచ్‌లు ఉన్నాయి.

Published by: Samala Srinivas | Apr 07, 2024

శిఖర్ ధావన్

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ధావన్ 98 క్యాచ్‌లు అందుకున్నాడు.

Published by: Samala Srinivas | Apr 07, 2024

రవీంద్ర జడేజా

ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 98 క్యాచ్‌లు పట్టాడు.

Published by: Samala Srinivas | Apr 07, 2024

VIEW ALL

Read Next Story