ఐపీఎల్ 2024 సీజన్ 18వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యచ్ లో సంజూ సేన ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించింది.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 113 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అయినా సరే ఆర్సీబీ ఓడిపోయింది. బట్లర్ సెంచరీతో రాజస్థాన్ గెలిచింది.
కోహ్లీ సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు. సురేశ్ రైనాను వెనక్కి నెట్టి ఈ రికార్డును తన పేరిట లఖించుకున్నాడు.
ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నంబర్-1 ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్‌లో అతని పేరిట 110 క్యాచ్‌లు ఉన్నాయి.
ఈ జాబితాలో సురేశ్ రైనా 109 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఈ లిస్ట్ లో కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. పొలార్డ్ ఐపీఎల్ లో 103 క్యాచ్‌లు పట్టాడు.
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ పేరిట 99 ఐపీఎల్ క్యాచ్‌లు ఉన్నాయి.
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ధావన్ 98 క్యాచ్‌లు అందుకున్నాడు.
ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా ఆరో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 98 క్యాచ్‌లు పట్టాడు.