ప్రపంచంలో అతి ఎత్తైన హిందూ దేవతల విగ్రహాలున్న దేశాలు ఇవే..
తమిళనాడులోని సేలంలోని మురుగన్ విగ్రహం 146 అడుగుల ఎత్తులో కొలువైంది.
భారతదేశంలోని కర్నాటకలో పంచముఖ ఆంజనేయ విగ్రహం 111 అడుగుల ఎత్తులో కొలువై ఉంది.
స్టాట్యూ ఆఫ్ ఈక్వెలాటీ గా రామానుజ అతిపెద్ద విగ్రహం 65.8 మీటర్ల (216 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది మన దేశంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కొలువై ఉంది.
ఇండోనేషియాలోని బాలిలో ఉన్న విష్ణు దేవుడి వాహనమైన గరుడి విగ్రహం 76 మీటర్లు (249 అడుగులు) ఎత్తు ఉంది.
నేపాల్‌లోని ఈ విగ్రహం 143 అడుగుల (43.5 మీటర్లు) ఎత్తున కొలువైంది.
ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో నెలకొల్పబడిన మా వైష్ణో దేవి విగ్రహం 141 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది 2013లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా భారతదేశంలోనే ఎత్తైన విగ్రహంగా గుర్తింపు పొందింది.
విశ్వాస స్వరూపంగా ఈ శివుడి విగ్రహాన్నిభక్తులు కొంగు బంగారంగా కొలుస్తారు. 112 మీటర్ల (367 అడుగులు) ఎత్తుంది. ఈ హిందూ దేవుడు శివుని విగ్రహం భారతదేశంలోని రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో కొలువైంది.