చైత్రమాసం పూర్ణిమ తిథినాడు ఉదయం బ్రాహ్మీమూహుర్తంలో మారుతి జన్మించాడు
కేసరి, అంజనలకు శివుడి అనుగ్రహం అనుగ్రహంతో హనుమంతుడు జన్మించాడు.
హనుమంతుడిని కొందరు కర్ణాటకలో జన్మించాడని చెబుతుంటారు.
మరికొందరు మాత్రం హనుమంతుడు తిరుపతిలోని జాపాలీలో అని అంటారు.
హనుమంతుడు పుట్టగానే సూర్యుడిని ఫలం అనుకొని తినడానికి వెళ్లాడంట
ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమాన్ పై దాడిచేయగా హనుమ సృహతప్పి పడిపోతాడు.
వెంటనే వాయుదేవుడు హనుమను కాపాడి గాలిని ఆగిపోయేలా చేస్తాడు.
వెంటనే రుషులు,మునులు, హనుమను మరల మాములు స్థితిలోకి వచ్చేలా చేస్తారు
అప్పుడు దేవుళ్లు, మునులు బాలహనుమంతుడికి అనేక వరాలు ఇస్తారంట.