ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఆరు డెస్టినేషన్ టూరిస్ట్ ప్లేసెస్ విషయానికొస్తే..
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఆరు డెస్టినేషన్ టూరిస్ట్ ప్లేసెస్ విషయానికొస్తే..
దుబాయ్ లో ప్రపంచంలోనే అతి ఎత్తైన కట్టడమైన బుర్జ్ ఖలీఫా ఒకటి. దీన్ని సందర్శించడానికి ప్రతి యేడాది ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు.
బాలి అందమైన బీచ్ లు, జంతువులు, జలపాతాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ఇది కాస్మోపాలిటన్ నగరంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ కళలు,సంగీతం, చారిత్రాత్మక సంఘటనలతో సాంస్కృతికంగా విభిన్నమైన గమ్యస్థానంగా నిలిచింది.
ఇటలీ రాజధాని రోమ్ నగరం చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన విహార ప్రదేశం. ఐరోపాలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో ఇది ఒకటి.
ప్రపంచంలో అతి ఎక్కువ మంది టూరిస్టులు సందర్శించే స్థలాల్లో ఇంగ్లాండ్ రాజధాని లండన్ ఒకటి. ప్రతియేడు 50 మిలియన్లకు పైగా పర్యాటకులతో ఎక్కువ మంది టూరిస్టులు సందర్శించే స్థలంగా నిలిచింది.
ఫుకెట్ దక్షిణ థాయిలాండ్‌లో అద్భుత రమణీయ ప్రదేశం. ఇక్కడ తెల్లటి ఇసుక బీచ్ లకు కారణంగా ఇది వరల్డ్ టాప్ మోస్ట్ రొమాంటిక్ టూరిస్ట్ ప్లేస్ లో ఒకటిగా నిలిచింది. మణి జలాలు మరియు తెల్లని ఇసుక బీచ్‌ల కారణంగా ప్రసిద్ధి చెందిన ప్రదేశం.
ఫ్రాన్స్ దేశం రాజధాని పారిస్ ను ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా రికార్డులకు ఎక్కనుంది. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే నగరాల్లో ఇది ఒకటి.