Best Health Juices: శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచే జ్యూస్‌లు ఇవే, మలబద్ధకం, షుగర్ వ్యాధులకు చెక్
చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా చాలా రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి
ఈ మధ్యకాలంలో ప్రతి ఐదుగురిలో ఇద్దరికి క్రాంప్స్, మలబద్ధకం, షుగర్ వ్యాధులు ఉంటున్నాయి.
కొన్ని రకాల జ్యూస్‌లు రోజూ నిర్ణీత మోతాదులో తాగడం వల్ల ఈ వ్యాధుల్ని నియంత్రించవచ్చు
మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు డైట్‌లో క్యారట్, ఆపిల్, అల్లం, గోబిలతో జ్యూస్ తయారు చేసుకుని తాగాలి. దీనివల్ల మల బద్ధకం సమస్య పోతుంది
క్రాంప్స్ సమస్యతో బాధపడేవాళ్లు తృణ ధాన్యాలు, కొత్తిమీర, కీరా, అల్లం, పసుపు వేర్లతో జ్యూస్ చేసుకుని తాగాలి. దీని వల్ల క్రాంప్స్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు
డయాబెటిస్ రోగులు క్యారట్, ఆపిల్, అల్లం, నిమ్మ, ఆనపకాయ, పాలకూర జ్యూస్ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.