బరువుని అదుపులో పెట్టి.. ఒంట్లో కాల్షియంను పెంచే..రాగి ఇడ్లీ తయారీ విధానం మీకోసం..
ముందుగా ఒక కప్ రాగులను శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
అలాగే రెండు కప్పుల మినప్పప్పును.. కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
ఇవి కనీసం 6 గంటల వరకు.. నానాలి. తరువాత గ్రైండర్లో.. ఈ రాగులను, మినప్పప్పును వేసి.. బాగా గ్రైండ్ చేసుకోవాలి.
దీన్ని రాత్రంతా పులువనివ్వాలి. ఉదయాన్నే ఈ పిండిలోకి తగినంత ఉప్పును.. నీళ్లను చేర్చి పిండిని రెడీ చేసుకోవాలి.
ఇడ్లీ పాత్రలో నీరు పోసి.. మరగనివ్వాలి. ఇడ్లీ ప్రేట్లకు కొంచెం నూనెను రాసి ఈ పిండిని ప్లేట్లలో ఇడ్లీ లాగా వేసుకోవాలి.
మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు.. అలాగే వదిలేయాలి. అంతే టేస్టీ టేస్టీ హెల్తీ రాగి ఇడ్లీ రెడీ.