ఆల్కహాల్ సేవించడం వల్ల లివర్ సిరోసిస్ అనే వ్యాధితో చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ఫుడ్ గురించి తెలుసుకుందాం.
లివర్ను కాపాడుకోవాలంటే శరీరాన్ని డిటాక్స్ చేసే జ్యూసులను తాగాల్సి ఉంటుంది. అప్పుడే మీ లివర్ వాడు కాకుండా కాపాడుకోవచ్చు.
పుదీనా కషాయం తాగడం వల్ల మీ లివర్ ను కాపాడుకోవచ్చు. లివర్లో ఉండే టాక్సిన్ లను ఇది తొలగిస్తుంది.
కొత్తిమీర కషాయం తాగడం వల్ల లివర్ లో ఉండే విష పదార్థాలను తొలగించుకోవచ్చు. తద్వారా మీరు లివర్ను కాపాడుకోవచ్చు.
క్యాబేజీ జ్యూస్ తాగడం వల్ల మీ లివర్ లో ఉండే టాక్సిన్లను తొలగించుకోవచ్చు. తద్వారా లివర్ కాపాడుకోవచ్చు.
బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం ద్వారా మీరు అనేక రకాల టాక్సిన్లు శరీరం నుంచి తొలగించుకోవచ్చు.
తమలపాకు కషాయం తాగడం ద్వారా మీ లివర్ చెడిపోకుండా కాపాడుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ లివర్ను కాపాడుతాయి.
అవకాడో జ్యూస్ తాగడం ద్వారా మీ లివర్ ను కాపాడుకునే అవకాశం ఉంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ లివర్ను కాపాడుతాయి.
తెల్ల గలిజేరు కషాయం తాగడం ద్వారా మీ లివర్ను కాపాడుకునే అవకాశం లభిస్తుంది.
ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.