మనం ఉదయాన్నే తినే టిఫిన్ పైనే.. మనం రోజంతా ఉందే ఎనర్జీ ఆధారపడి ఉంటుంది. మరి రోజంతా ఎనర్జీగా ఉంచే.. సేమ్యా దద్దోజనం.. ఎలా చేసుకోవాలో చూద్దాం..
ముందుగా ఒక కప్పు సేమ్యాని.. వేడి నీళ్లలో వేసి ఉడికించాలి. సేమ్యా 80% ఉడికిన తర్వాత.. దానిని ఒక స్టైనర్ లో వేసి ఉంచాలి. ఆ సేమ్యాలో కొంచెం నూనె ఉప్పు వేసి.. చల్లార్చుకోవాలి.
సేమ్యా చల్లారిన తర్వాత..అందులో ఒక కప్పుడు పెరుగు, అర గ్లాసు పాలు.. వేసుకునే బాగా కలుపుకోవాలి.
తరువాత ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని.. అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ పచ్చిశనగపప్పు, టీ స్పూన్ మినప్పప్పు, కొంచెం ఇంగువ.. వేసి బాగా వేయించుకోవాలి.
తాలింపు వేగిన తర్వాత.. అందులో ఒక గుప్పెడు జీడిపప్పులను.. కూడా వేసి వేయించుకోవాలి.
చివరిగా కరివేపాకు వేసి తాలింపు ని దించేయాలి. ఈ తాలింపును సేమియా మిశ్రమంలో.. వేసి బాగా కలుపుకోవాలి.
చివరిగా కొన్ని దానిమ్మ గింజలు.. కొన్ని కట్ చేసిన ద్రాక్షాలను.. వేసుకుంటే రుచి మరింత పెరుగుతుంది.