ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయలు మార్కెట్లో కనిపిస్తాయి
డయాబెటిస్ పేషెంట్లు చక్కర ఉంటుందని తినరు.
షుగర్ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయను తినవచ్చా? లేదా? తెలుసుకుందాం
సాధారణంగా షుగర్ పేషెంట్లు ఏ ఆహారం తిన్నా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవి తీసుకోవాలి.
పుచ్చకాయలో గ్లైసోమిక్స్ ఇండెక్స్ 72 ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం షుగర్ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయను కొద్ది మొత్తంలో తినాలి.
ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి
వారానికి రెండు సార్లు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
వీలైతే పుచ్చకాయ తిన్న తర్వాత షుగర్ టెస్ట్ చేయించుకోవడం బెటర్