ముంబై సహా భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..

';


ముంబై మన దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో మొదటి స్థానంలో ఉంది. అంతేకాదు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ఇది ఒకటి. మన దేశంలో ముంబై తర్వాత అత్యంత ఖరీదైన నగరాల జాబితా విషయానికొస్తే..

';

ముంబై - మహారాష్ట్ర

అధిక జీవన వ్యయం, గృహా, ఆహార ధరల్లో ఉన్న వ్యత్యాసాలు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల కారణంగా మన దేశంలో ముంబై అత్యంత ఖరీదైన నగరాల్లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది.

';

ఢిల్లీ - దేశ రాజధాని

దేశ రాజధాని ఢిల్లీ కూడా ముంబై తర్వాత అత్యంత జీవన వ్యయం ఉన్న నగరాల్లో రెండో ప్లేస్ ఉంది. ముఖ్యంగా ఇల్లు, ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి ఆధారంగా ఈ స్థానాన్ని నిర్ణయించారు.

';

బెంగళూరు - కర్ణాటక

కర్ణాటక రాజధాని బెంగళూరు కూడా అత్యంత ఖరీదైన నగరాల్లో ఇది ఒకటి. మన దేశంలో సాఫ్ట్ వేర్ మరియు రక్షణ రంగ ఉత్పత్తులో ఈ నగరానిదే అగ్ర స్థానం.

';


ఇక్కడ ప్రజలు జీవన ప్రమాణాలు ఎక్కువగా ఉండటం మూలానా.. మన దేశంలో మూడో అత్యంత ఖరీదైన నగరంగా ఖ్యాతి గడించింది.

';

చెన్నై - తమిళనాడు

తమిళనాడు రాజధాని చెన్నై ముందు నుంచి ఇక్కడ సినీ,పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ ఉంది. అంతేకాదు సాంస్కృతిక పరంగాను విద్యా పరంగా, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఇది టాప్ 4లో ఉంది.

';

పూణే - మహారాష్ట్ర

మహారాష్ట్రలో ముంబై తర్వాత అత్యంత ఖరీదైన నగరం పూణే. బెంగళూరు, హైదరాబాద్ ల తర్వాత ఐటీ కేంద్రంగా పూణే ఉంది. ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు ఆధారంగా మన దేశంలో అత్యంత ఖరీదైన ఐదో ప్రధాన కేంద్రంగా ఉంది.

';

VIEW ALL

Read Next Story