ప్రతిఒక్కరూ తాము తెల్లగా అందంగా కనిపించాలని కోరుకుంటారు. కొంతమందికి నల్లమచ్చలు, పిగ్మెంటేషన్ ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి మచ్చలను తొలగించి మెరిసే చర్మం కావాలా
బియ్యం పిండితో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. బియ్యం పిండిలో విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
బియ్యం పిండితో ఎన్నో ఫేస్ ప్యాక్ లు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
2 చెంచాల బియ్యంపిండిలో 1 చెంచా తేనె, కొంచెం నీళ్లు పోసి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖానికి పట్టించి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
2 టేబుల్ స్పూన్ల బియ్యంపిండిలో ఒక టేబుల్ స్పూర్ పెరుగు, పసుపు వేసి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖానికి పట్టించి 15-20 నిమిషాలపాటు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.
గ్రీన్ టీ బ్యాగ్ ను వేడి చేసి నీటిలో 5 నిమిషాలు నానబెట్టాలి. చల్లారిన తర్వాత ఇందులో బియ్యంపిండి, నిమ్మరసం వేసి కలిపి ముఖానికి మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
1 చెంచా బియ్యంపిండి, చెంచా శెనగపిండి, అరకప్పు టమాటా రసం కలిపి కళ్ల చుట్టూ రాయాలి. అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
2 చెంచాల బియ్యం పిండి, 2 చెంచాల అలోవెర జెల్, 1 చెంచా తురిమిన దోసకాయ వేసి మెత్తని పేస్టులా తయారు చేయాలి. ఈ పేస్టు ముఖానికి పట్టించి 20 నిమిషాలు ఉంచి శుభ్రం చేసుకోవాలి.
ఈ ఫేస్ ప్యాక్ వారానికి రెండు సార్లు లేదా మూడు సార్లు ముఖానికి రాసుకోవచ్చు.