చర్మాన్ని నిగనిగలాడించే చట్నీ.. వారంలో ఒక్కసారైనా తినండి..

Dharmaraju Dhurishetty
Aug 13,2024
';

పుదీనా ఆకుల్లో శరీరానికి కావలసిన విటమిన్ ఏ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది.

';

పుదీనా ఆకుల్లో విటమిన్ సి కూడా అధిక మోతాదులో లభిస్తుంది కాబట్టి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

';

ఇందులో విటమిన్ కే కూడా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేయడం కాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను విముక్తి కలిగిస్తుంది.

';

అలాగే ఈ ఆకుల్లో మెగ్నీషియం, క్యాల్షియం ఇతర మూలకాలు కూడా అధిక మోతాదులో ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి.

';

మీరు కూడా పుదీనా చట్నీ రోజు తినాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇలా తయారు చేసుకోండి.

';

పుదీనా చట్నీకి కావలసిన పదార్థాలు: పుదీనా - 1 కట్ట, కొత్తిమీర - 1/2 కట్ట, పచ్చిమిర్చి - 2-3, ఉల్లిపాయ - 1/2 (చిన్నది)

';

కావలసిన పదార్థాలు: శనగపప్పు - 1 టీస్పూన్, జీలకర్ర - 1 టీస్పూన్, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్ స్పూన్లు

';

తయారీ విధానం: పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోయాలి.

';

ఆ తర్వాత శనగపప్పు, జీలకర్రను నూనెలో వేయించి, పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఒక మిక్సీలో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వేయించిన శనగపప్పు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

';

ఆ తర్వాత అన్ని మిశ్రమాలు గ్రైండర్ గిన్నెలో వేసుకుని అందులోనే తగినంత ఉప్పు, నిమ్మరసం కలుపుకొని మరోసారి బాగా మిక్సీ కొట్టుకోవాలి. అంతే పుదీనా చట్నీ రెడీ అయినట్లే..

';

పుదీనా చట్నీని వేడి అన్నం, ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వాటితో వడ్డించవచ్చు.

';

చిట్కాలు: పుదీనా చట్నీని మరింత రుచిగా చేయడానికి, కొద్దిగా పుల్లని పెరుగు లేదా నిమ్మరసం వేయవచ్చు.

';

పుదీనా చట్నీని ఫ్రిజ్‌లో నిల్వ చేసి, 2-3 రోజుల వరకు తాజాగా ఉంచుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story