చిప్స్ తింటే బరువు పెరిగిపోతారు అనేది ఎంతోమందికి ఉన్న బాధ. అయితే బరువు తగ్గించే చిప్స్ కూడా ఉన్నాయి అని మీకు తెలుసా. అవును..ఎయిర్ ఫ్రయర్‌లో తయారు చేసే బీట్‌రూట్ చిప్స్ తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయి.
బీట్‌రూట్‌లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల.. జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది.
సాధారణ చిప్స్‌తో పోల్చితే, ఎయిర్ ఫ్రయర్ బీట్‌రూట్ చిప్స్ బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఎందుకంటే ఎయిర్ఫయర్లో చేసే చిప్స్ కి అస్సలు ఆయిల్ అవసరం లేదు.
బీట్‌రూట్‌లో ఉన్న ఐరన్, విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి.. చాలా మంచివి.
బీట్‌రూట్ సన్నగా తరిగి, చాలా కొద్దిగా నూనె, ఉప్పు జతచేసి ఎయిర్ ఫ్రయర్‌లో పెట్టి.. 200 డిగ్రీలు 10 నిమిషాలు సెలెక్ట్ చేసుకుంటే చాలు.. వెంటనే రుచికరమైన చిప్స్ సిద్ధమవుతాయి.
ఈ చిప్స్ తినడం ద్వారా శరీరానికి ఫైబర్ అందమే కాకుండా.. బరువు తగ్గడం సులభం.
కాబట్టి ఈ ఎయిర్ ఫ్రైయర్ బీట్‌రూట్ చిప్స్ తింటే.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.