జ్నాపకశక్తిని పెంచుకునేందుకు చాలా మంది ఎన్నో పద్ధతులను పాటిస్తుంటారు. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తారు. ఏ ఆహార పదార్థాలు జ్నాపకశక్తికి పదును పెడుతుందో తెలుసుకుందాం.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దీనికోసం పోషక విలువలను ఆహారంలో చేర్చుకోవాలి.
జ్నాపకశక్తిని పదును పెట్టే అనేక అంశాలు ఉన్నాయి. దీంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇందులో ఉన్నాయి. దీన్ని తినడం వల్ల బ్రెయిన్ మారి ఏదైనా ఎక్కువ కాలం గుర్తుంటుంది.
బాదంలో విటమిన్ ఇ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్నాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి. వీటిని తినడం వల్ల మెదడుకు తగిన పోషకాలు లభిస్తాయి.
పాలకూరలో ఫోలేట్, ఐరన్, విటమిన్ కె వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. వీటిని తినడం వల్ల మెదడు చురుకుదనం పెరిగి ఆలోచించే శక్తి పెరుగుతుంది.
బ్లూ బెర్రీస్ లో పుష్కలంగా ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి మెదడు దెబ్బతినకుండా కాపాడుతాయి. వీటిని తినడం వల్ల జ్నాపకశక్తి బలపడుతుంది.
ప్రతిరోజూ ఉదయం పాలలో నానబెట్టిన మఖానా తింటే..అందులో ఉండే కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు మఖానాతో కలిసి జ్నాపకశక్తిని పెంచుతాయి.