శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే అద్భుతమైన పొడి.. అన్నంలో కలుపుకొని తింటే బోలెడు లాభాలు!
Dharmaraju Dhurishetty
Dec 24,2024
';
కరివేపాకుతో తయారుచేసిన పొడిని తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జుట్టు సమస్యలతో బాధపడే వారికి ఇది గొప్ప ఔషధంగా భావించవచ్చు.
';
కరివేపాకు పొడి అన్నంతో పాటు కలుపుకుని తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
';
ముఖ్యంగా ఆంధ్ర స్టైల్లో తయారు చేసే కరివేపాకు పొడి ఎంతో ఆరోగ్యకరమని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే ఈ పొడిని మీరు కూడా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా?
';
ఆంధ్ర స్టైల్ లో కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో? ఈ పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు: ధనియాలు - 1 టేబుల్ స్పూను, ఎండుమిర్చి - 6-8 (నీ నోటికి తగినంత), జీలకర్ర - 1 టీ స్పూను, వెల్లుల్లి రెబ్బలు - 4-5, చింతపండు - కొద్దిగా, ఉప్పు - రుచికి సరిపడా, 1 టేబుల్ స్పూను నూనె
';
తయారీ విధానం: ముందుగా ఈ పొడిని తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవలసి ఉంటుంది. దానిని స్టవ్ పై పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని వేడి చేసుకోండి.
';
ఇలా వేడి చేసుకున్న తర్వాత అందులోనే శనగపప్పు మినప్పప్పు వేసుకొని బాగా వేయించుకోవలసి ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని మారి కాస్త వేయించుకోండి..
';
అన్ని బాగా వేగిన తర్వాత అందులోనే కరివేపాకు వేసుకొని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా వేపుకోండి. బాగా వేగిన తర్వాత దానిని చల్లార్చి కొద్దిసేపు పక్కన పెట్టుకోండి.
';
ఇలా పక్కన పెట్టుకున్న కరివేపాకు మిశ్రమాన్ని పొడిలా తయారు చేసుకోవడానికి మిక్సీలో వేసుకుని బాగా మిక్సీ కొట్టుకోండి. ఇందులోనే జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు వేసి బాగా మిక్సీ పట్టుకోండి.
';
పొడిలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దానిని ఒక గాజు సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు అన్నం తినే సమయంలో నెయ్యి తో పాటు ఈ పొడిని మిక్స్ చేసుకొని తింటే రుచి వేరే లెవెల్..