ఎంతోమంది భర్తలు.. తమ భార్యలను దయచేసి నైటీలు వేసుకోవద్దండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ అమ్మాయిలు మాత్రం అవి వదిలిపెట్టలేరు.
మరి నైటీలు వద్దు అనుకున్నప్పుడు.. వాటికి కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయని మీకు తెలుసా.
వీటి గురించి తెలుసుకోవడం వల్ల.. ఎంచక్కా మీకు ఇష్టమైన నైటీలు వేసుకుంటూనే.. నీ భర్తకు స్టైలిష్ గా కనిపివ్వొచ్చు.
కాఫ్తాన్ నైటీలు చాలా చాలా ట్రెండీగా ఉంటాయి. యానిమల్ సినిమాలో రష్మిక ఈ నైటీలను ఎక్కువగా వేసుకుంది.
ఇవి కూడా నైటీల్లాగే చాలా లూస్ గా ఉంటాయి. ఈ కాఫ్తాన్లు.. వివిధ రకాల డిజైన్లు, ప్రింట్లు, రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.
మ్యాక్జీ టీషర్ట్ మీకు నైటీలు లాగా కంఫర్ట్ ఇవ్వడమే కాకుండా.. మీరు ఎంతో స్టైలిష్ గా కనిపించేటట్టు చేస్తుంది.
ఈ మ్యాక్సీ టీ షర్ట్ పేరుకి తగ్గట్టుగానే టీషర్ట్ పొడవు మోకాళ్లు దాటి ఉంటుంది. కింద లూజ్ ప్యాంట్, పైజామా లాంటివి వేసుకోవచ్చు.
ఇక నైట్ డ్రెస్ కూడా ట్రెండీగా ఉండాలి అనుకుంటే.. కింద మామూలు ప్యాంట్లు బదులు హరెమ్ (harem pants) ప్యాంట్లు ఎంచుకోవచ్చు. వీటిలో మీరు ఎంతో స్టైలిష్ గా కనిపిస్తారు.