Independence Day 2024 : సినీ జవాన్లకు భార్యలుగా నటించిన హీరోయిన్లు వీరే..!!

';

సరిలేరు మీకెవ్వరూ : రష్మిక మందన్న

ప్రిన్స్ మహేష్ బాబు వీర జవాన్ గా నటించిన సరిలేరు మీకు ఎవరు సినిమాలో ఆయనకు జోడిగా అందాల తార రష్మిక మందానా ఒక మెరుపు మెరిసింది. ఈ అమ్మడు ఈ సినిమాలో చేసిన అల్లరి అంతా కాదు.

';

సరైనోడు : రకుల్ ప్రీత్ సింగ్

సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ మిలిటరీ మేజర్ గా కనిపించి మనందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సినిమాలో సైనికులు కేవలం సరిహద్దుల్లో మాత్రమే కాదు దేశంలో ఉన్న చీడపురుగులను కూడా ఏరివేయాలని మెసేజ్ ఇచ్చాడు. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రకుల్ ప్రీ

';

మేజర్ : శోభితా ధూళిపాల

అడవి శేష్ నటించిన మేజర్ సినిమాలో వీర జవాన్ కు జంటగా ప్రముఖ నటి మిస్ ఇండియా శోభితా ధూళిపాల తళుక్కున మెరిసింది. అందంతో పాటు అభినయం కూడా ఈ సినిమాలో ప్రదర్శించడం విశేషం.

';

పరమవీర చక్ర : అమిషా పాటిల్

నందమూరి బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర సినిమాలో ఆయన సరసన అమీషా పాటిల్ ఆకట్టుకుంది. మిలిటరీ అధికారి భార్యగా అమీషా పాటిల్ మంచి నటన కనబరిచింది.

';

నిన్నే ప్రేమిస్తా : సౌందర్య

మిలటరీ జవానుగా యువ సామ్రాట్ నాగార్జున తన నటనతో ఆకట్టుకున్న సినిమా నిన్నే ప్రేమిస్తా.. ఈ సినిమాలో తన అద్భుతమైన అందంతోను అభినయంతోను సౌందర్య జీవించిందని చెప్పాలి.

';

వెంకీమామ : రాశీ ఖన్నా

వెంకటేష్, నాగ చైతన్య నటించిన వెంకీ మామ మూవీ సైతం మిలటరీ బ్యాక్ డ్రాప్ లోనే కనిపిస్తుంది. 2019లో వచ్చిన ఈ మూవీలో నాగచైతన్య మిలటరీ ఆఫీసర్ గా కనిపించగా, ఆయన సరసన రాశీ ఖన్నా తళుక్కున మెరిసింది.

';

సీతారామం : మృణాల్ ఠాకూర్

దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామన్ సినిమాలో మిలటరీ జవాన్ ప్రేయసిగా మృణాల్ ఠాకూర్ అద్భుతమైన నటన కనబరిచింది.

';

యుద్ధభూమి : విజయశాంతి

1988లో చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన యుద్ధ భూమి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సైనికాధికారిగా కనిపించాడు. ఈ సినిమాలో ఆయన సరసన నటించిన విజయశాంతి మంచి నటన కనబరించింది.

';

మంగమ్మగారి మనవడు : సుహాసిని

నందమూరి బాలకృష్ణ కు ఇండస్ట్రీ హిట్ అందించిన మంగమ్మగారి మనవడు సినిమాలో ఆయన సైనికుడిగా కనిపిస్తాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన మరదలుగా సుహాసిని నటనకు మంచి మార్కులే పడ్డాయి.

';

VIEW ALL

Read Next Story