జుట్టును ఒత్తుగా పెంచి ఇంటి ఫార్ములా.. ఒక్కసారి ట్రై చేసి చూడండి!
Dharmaraju Dhurishetty
Dec 26,2024
';
ఆధునిక జీవనశైలి వల్ల చాలామందిలో జుట్టు సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంతమందిలో బట్టతల వస్తే మరికొంతమందిలో అనేక సమస్యలు వస్తున్నాయి.
';
ముఖ్యంగా జుట్టు సమస్యలను నిర్మూలించేందుకు చాలామంది లక్షలు ఖర్చుపెట్టి వివిధ రకాల ప్రోడక్ట్ వినియోగిస్తున్నారు.
';
ఎలాంటి ప్రొడక్ట్స్ వినియోగించినప్పటికీ జుట్టు సమస్యల నుంచి విముక్తి పొందలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కొన్ని ఇంటి చిట్కాలతో సులభంగా ఉపశమనం పొందవచ్చు.
';
ముఖ్యంగా మెంతి గింజలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల జుట్టు సమస్యలతో పాటు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవచ్చు.
';
అయితే చాలామంది మెంతి గింజలతో నానబెట్టిన నీటిని తాగే క్రమంలో కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ఈ నీటిని తయారు చేసుకునే క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు పడుతున్నారు.
';
మెంతి గింజలను నానబెట్టి నీటిని, మెంతి గింజల డికాషన్ తాగడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.
';
మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వడకట్టుకొని అందులో తేనె కలుపుకొని తాగితే జుట్టు అందంగా పెరుగుతుంది.
';
ఈ నీటిని తాగడం వల్ల జుట్టు రాలకుండా కూడా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
';
మెంతి గింజలను టీగా కూడా తయారు చేసుకోవచ్చు. దీనినే కొంతమంది డికాషన్ గా కూడా పిలుస్తారు. ఈ డికాషన్ తాగడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.
';
మెంతి గింజల డికాషన్ తయారు చేసుకోవడానికి ముందుగా మెంతి గింజలను తీసుకొని ఒక బౌల్‌లో వేసుకొని బాగా మరిగించుకోండి.
';
ఇలా మరిగిన తర్వాత నీటిని వడగట్టుకుని, అందులో తేనె కలుపుకొని తాగితే రుచికి రుచి.. జుట్టు ఆరోగ్యానికి ఆరోగ్యం పొందుతారు..