సత్యభామ సీతా కంటే అందంగా ఉన్నానందుకు కృష్ణుడు ఏం చేశాడో తెలుసా?
Dharmaraju Dhurishetty
May 30,2024
శ్రీకృష్ణుని ఎంతో అందమై భార్యలలో సత్యభామ ఒకరు. ఆమె అందరి కంటే ఎక్కువగా ఉంటుందని గర్వపడేది.
కృష్ణుడు ఒక్క రోజు ద్వారకలో సింహాసనంపై కూర్చున్నప్పుడు అక్కడికి సత్యభామ వచ్చి ఒక ప్రశ్న అడుగుతుంది. అదేంటంటే..
సత్యభామ అడిగిన ప్రశ్న.. త్రేతాయుగంలో మీరు ప్రవిత్రమైన రాముడి అవతారంలో ఉన్నప్పుడు మీకు భార్య సీతా దేవి. అప్పుడు సీతా నా కంటే అందంగా ఉండేదా?
ఈ ప్రశ్నకు శ్రీ కృష్టుడు ఇలా ఆర్థం చేసుకున్నాడు.. సత్యభామ తనకు ఉన్న అందాన్ని చూసి ఎంతగానో గర్వీస్తోందని మౌనంగా ఉండిపోయాడు.
అదే సమయంలో గరుడుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆయన కూడా ఇలా అన్నాడు. ఈ లోకంలో నాకంటే చైతన్య వంతులున్నారా? అని ప్రశ్నించాడు.
అయితే సుదర్శన చక్రం కూడా ఇలా ప్రశ్న అడిగింది. ప్రపంచంలో నా కంటే శక్తివంతులేవరైనా ఉన్నారా? అని
ఈ ముగ్గురి గర్వాన్ని గుర్చించి శ్రీ కృష్ణుడు.. వారికి గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. దీంతో ఆయకు ఒక ఆలోచన తట్టింది.
శ్రీ కృష్ణుడికి తట్టిన ఉపాయం ప్రకారం.. సీతా దేవి ఇక్కడే ఉందని గరుడుడిని హనుమంతుడి దగ్గరికి పంపుతాడు.
ఇలా పంచిన తర్వాత హనుమంతుడు దగ్గరుకు చేరుకున్న గరుడు సీతాదేవి జాడ చెబుతారు. గరుడుడు కంటే వేగంగా కోతి వేషంలో ఉన్న హనుమంతుడు చేరుకుంటాడు. దీంతో గరుడుడి గర్వం తగ్గుతుంది.
అయితే హనుమంతుడు అక్కడికి చేరుకోగానే కృష్ణుడు ఉన్న ప్రదేశంలో సుదర్శన చక్రం ఆయనను ఆపేస్తుంది. దీంతో హనుమాన్ ఉగ్రరూపం దాల్చి చక్రాన్ని నోట్లో పెట్టుకుని కృష్ణుడి దగ్గరకు చేరుకుంటారు. అప్పుడు సుదర్శనుడి గర్వం పోతుంది.
అక్కడి చేరుకుని హనుమంతుడు కృష్ణుడుని సత్యభామను చూసి ఈ పనిమనిషి ఎవరు అని అడుగుతాడు. దీంతో ఆమె గర్వం పోతుంది.